- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్ : గవర్నర్‌పై సర్కార్ యూటర్న్
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌పై వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంది. గవర్నర్ ప్రసంగం ఉంటుందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా వచ్చే నెల 3న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 21న గవర్నర్‌ను అనుమితి కోరిన విషయం తెలిసిందే. గవర్నర్ నుంచి స్పందన లేకపోవడంతో ఈనెల 27న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి తమిళిసైకి లేఖ రాశారు. లేఖలో బడ్జెట్‌కు ఆమోదం తెలపాలని హరీష్ రావు కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారుకు గవర్నర్ తమిళిసై సోమవారం లేఖ రాశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం ఉందా లేదా అని గవర్నర్ లేఖలో ప్రశ్నించారు. కాగా బడ్జెట్ సిఫార్సులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయని నేపథ్యంలో ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా సర్కారు పిటిషన్ వెనకకు తీసుకోవడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.
Read more:
బ్రేకింగ్: గవర్నర్ ఎఫెక్ట్.. తెలంగాణ బడ్జెట్ తేదీల్లో మార్పు.