Breaking: ఐటీఐలను నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా మార్చబోతున్నాం: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-06-19 12:51:48.0  )
Breaking: ఐటీఐలను నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా మార్చబోతున్నాం: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీఐలను నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా మార్చబోతున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టాటా కంపెనీ ఆధ్వర్యంలో త్వరలోనే విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణను ఇప్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 295 ఐటీఐ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వాటిల్లో మొత్తం 32 కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఉత్తమ్ అన్నారు. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే.. కేవలం ఆరు నెలల వ్యవధిలో తమ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. తన సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లో రూ.కోటి నిధులతో మినీ స్టేడియంను నిర్మించబోతున్నామని తెలిపారు. అదేవిధంగా రూ.78 కోట్ల నిధులతో డబుల్ బెడ్‌రూంల నిర్మాణాలను చేపడతామన మంత్రి ఉత్తమ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed