- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గవర్నమెంట్ Vs అపొజిషన్.. ‘బోనస్’ పాలిటిక్స్‌తో రాజకీయ దుమారం!
దిశ, తెలంగాణ బ్యూరో : ఖరీఫ్ సీజన్ నుంచి క్వింటాల్ సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయ దుమారం మొదలైంది. ఎన్నికల మేనిఫెస్టోలో వరి ధాన్యం ప్రతి క్వింటాల్‌కు బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చిందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దొడ్డు వడ్లకు సైతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సన్న రకాలను ప్రోత్సహించేందుకు బోనస్ ఇస్తే అటు రైతులకు, ఇటు ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
ఎన్నికల టైమ్‌లోనే పంచాయితీ మొదలు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనే వడ్లకు బోనస్ ఇవ్వాలనే పంచాయితీ మొదలైంది. ఈ విషయంపై ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ ప్రకారం ప్రతి క్వింటాల్ వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు దీనిపై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే బోనస్ ఇస్తామని ప్రకటన చేశారు.
దొడ్డు రకానికి సైతం బోనస్ ఇవ్వాలని ప్రతిపక్షాల డిమాండ్
రెండు రోజుల క్రితం నిర్వహించిన కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కేవలం సన్న రకాల వడ్లకే బోనస్ ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నారు. ఇదే విషయాన్ని మీడియాకు సైతం వివరించారు. దీనిని విపక్షాలు అస్త్రంగా మలుచుకున్నాయి. సన్నాలకు మాత్రమే ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాసంగిలో రైతులు కేవలం దొడ్డు వడ్లనే పండిస్తారనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నాయి. యాసంగిలో పండించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండగా.. వాటికి సైతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
రైతుల మేలు కోసమే..
మార్కెట్‌లో సన్న వడ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. దొడ్డు రకాలను ప్రజలు తినడం లేదు. కేవలం తెల్లరేషన్ కార్డు హోల్డర్ల కోసం మాత్రం వాటిని కొనుగోలు చేసి ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. అందులో మెజారిటీ శాతం బియ్యం రేషన్ డీలర్లు, మిల్లర్లు, అధికారులు కుమ్మక్కవడంతో రీ–సైక్లింగ్ అవుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇలా ఈ ప్రక్రియలో ప్రతి నెలా రూ.వందల కోట్ల ప్రభుత్వ సొమ్ము లూటీ అవుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ దందాకు ఫుల్‌స్టాప్ పడాలంటే సన్న వడ్లను ఎంకరేజ్ చేయడమే పరిష్కారమని భావిస్తున్నారు. అందులో భాగంగానే సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తే వాటిని సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తారని, భవిష్యత్‌లోనూ తెల్ల రేషన్‌కార్డు దారులకు సైతం సన్న బియ్యం సరఫరా చేయొచ్చని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కానీ విపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి.
బోనస్‌పై తొందరపడ్డమా?
ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆకాల వర్షాల వల్ల చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. మరో వైపు తూకంలో తరుగు తీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసారి ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్పడంతో రైతులు విత్తనాల కోసం క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పండించే సన్న వడ్లకు ఇప్పుడే బోనస్ ప్రకటించడం తొందరపాటు నిర్ణయమని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ నిర్ణయం రైతాంగంలో నెగెటివ్‌గా మారే ప్రమాదముందని, భవిష్యత్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నట్టు టాక్.