- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాంపల్లి కోర్టుకు బాంబ్ బెదిరింపు.. కాసేపట్లో కూల్చేస్తామంటూ వార్నింగ్..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వరుస బాంబు బెదిరింపు ఫోన్స్ కాల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో బాంబ్ పెట్టామని.. కాసేపట్లో కూల్చేస్తామంటూ మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయగా.. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందం ద్వారా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబ్ లేకపోవడంతో ఊపీరి పీల్చుకున్నారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తి ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఓ పక్క విచారణ జరుగుతుండగానే తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి హైకోర్టుకు బాంబ్ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది.
నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామని.. మరి కాసేపట్లో కూల్చేస్తామని ఆగంతకుడు పోలీసులు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నాంపల్లి కోర్టులో బాంబ్ స్క్వాడ్ బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణంలో ఎలాంటి బాంబ్ ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో వచ్చింది ఫేక్ కాల్ అని నిర్ధారించి.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెంట వెంటనే నగరంలోని ప్రముఖ ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు.