- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేన్సర్ వ్యాధిపై డాక్టర్ అలైదా గువేరాతో బోయినపల్లి వినోద్ కుమార్ భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజల కోసం సోషలిస్టు దేశాలు నిలబడతాయని, అందులో భాగంగానే క్యూబా ప్రపంచ మానవాళికి అండగా నిలిచేందుకు కేన్సర్ వ్యాక్సిన్ ను అందించబోతుండటం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రపంచ విప్లవయోధులు చే గువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరాతో ఆయన భేటీ అయ్యారు. కేన్సర్ తో పాటు ప్రమాదకర వ్యాధులపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మాట్లాడుతూ పెట్టుబడిదారీ దేశాలు ప్రజల అవసరాలతో వ్యాపారం చేస్తాయని, కానీ సోషలిస్టు దేశం క్యూబా మాత్రం ప్రజల కోసం నిలబడుతోందన్నారు. కేన్సర్ తో పాటు ప్రమాదకర వ్యాధులను సమూలంగా తుడిచి పెట్టేందుకు క్యూబా కంకణం కట్టుకుందని, ఇది గొప్ప విషయం అన్నారు.
డాక్టర్ అలైదా గువేరా మాట్లాడుతూ ఫిడేల్ కాస్ట్రో చొరవ తో విద్యా పరంగా క్యూబా పురోగతి సాధించిందని, దేశంలోని డాక్టర్లు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 56 దేశాలలో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. అమెరికా ఆర్థిక పరంగా ఆంక్షలు విధించినా ధైర్యంతో క్యూబా ముందుకు సాగుతోందన్నారు. సోషలిస్టు దేశం ' క్యూబా ' నిస్వార్థంగా అల్జీమర్స్ వ్యాధితో పాటు లంగ్ కేన్సర్, సర్విక్స్ కేన్సర్, ప్రాస్టెడ్ కేన్సర్ వంటి మహమ్మారి నుంచి ప్రపంచ మానవాళికి విముక్తి కలిగించేందుకు వ్యాక్సిన్ ను అందించబోతోందని, వ్యాక్సిన్ తయారీ చివరి దశలో ఉందని తెలిపారు. విద్యా, వైద్య రంగాల్లో క్యూబా దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. వైద్య రంగంలో క్యూబా ఇప్పటికే ప్రపంచ మానవాళికి సేవలు అందిస్తోందన్నారు. కేన్సర్, ప్రమాదకర వ్యాధుల నుంచి ప్రపంచ మానవాళిని ఆదుకోవడమే క్యూబా లక్ష్యం అని వెల్లడించారు.