- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ ఎన్నికల వేళ BJP మహిళా మోర్చకు కీలక బాధ్యతలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ఆయా లోక్ సభల వారీగా మహిళా శక్తి సమ్మేళనాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారి సూచించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహిళా మోర్చా పదాధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై ఆయన వారికి దిశా నిర్దేశం చేశారు. 17 లోకసభ స్థానాల్లో మహిళా శక్తి సమ్మేళనాలను నిర్వహించాలని సూచించారు.
అలాగే ప్రతి మండల, డివిజన్స్ స్థాయిలో మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఆశ వర్కర్స్, అంగన్వాడీ టీచర్లతో మహిళా సమ్మేళనాలు నిర్వహించి వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని తెలియజేశారు. కొత్తగా ఓటు హక్కు కలిగిన మహిళా ఓటర్లను ప్రత్యేకంగా కలిసి మోడీ పథకాలను తెలియజేసి వారిలో బీజేపీపై విశ్వాసం కల్పించాల్సిందిగా సూచించారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మహిళా మోర్చా ప్రభారీ చింతల రామచంద్ర రెడ్డి, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పద్మ వీరపనేని, మహిళా మోర్చా పదాధికారులు, పార్లమెంటరీ మహిళా కన్వీనర్లు, కోకన్వీనర్లు పాల్గొన్నారు.