- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్టీసీ కార్మికులకు లక్ష బోనస్ ఏది?
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ఆర్టీసీకి అన్యాయం చేశారని తెలంగాణ బీజేపీ ధ్వజమెత్తింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి ఉందని ఆరోపించింది. ఆర్టీసీ కార్మికులకు నెలనెలా జీతాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని తెలంగాణ బీజేపీ గురువారం ట్వీట్ చేసింది. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ హామీలు ఇచ్చి మరిచిపోయారని సంస్థలో 10వేల కొత్త నియామకాలు చేపడాతమని, ఏటా రూ.వెయ్యి కోట్ల సాయం అందజేస్తామని గతంలో ప్రకటించారని పేర్కొంది. నాలుగు నెలలకోసారి సమీక్ష, కార్మికులకు రూ.లక్ష బోనస్, ఉద్యోగుల పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్, ఉద్యోగులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, తల్లిదండ్రులకు ఉచిత వైద్యం హామీలు అమలు కావడం లేదని వీటిని ప్రశ్నిస్తారని కార్మికుల ఉద్యమాన్ని అణగదొక్కారని ధ్వజమెత్తారని ట్వీట్‌లో ఆరోపించింది.
ఆర్టీసీకి అన్యాయంచేసిన సీఎం కేసీఆర్, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోడానికి ముందుకురాని పరిస్థితి. ఆర్టీసీ కార్మికులకు నెలనెలా జీతాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితి.#KCRfailedTelangana pic.twitter.com/Fejg4hAPXO
— BJP Telangana (@BJP4Telangana) May 18, 2023