పునరాలోచనలో BJP.. అసెంబ్లీ ఎన్నికల వేళ రసవత్తరంగా మారనున్న MLC ఎన్నిక!

by Satheesh |
పునరాలోచనలో BJP.. అసెంబ్లీ ఎన్నికల వేళ రసవత్తరంగా మారనున్న MLC ఎన్నిక!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారుతోంది.ఈ ఎన్నికలో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతివ్వడంతో పోటీపై బీజేపీ పునరాలోచనలో పడింది. తొలుత ఈ ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని బీజేపీ భావించింది. అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా మజ్లిస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో పోటీ చేసే విషయంలో బీజేపీ నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 13న జరగనున్న ఈ ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం ఎల్లుండితో ముగియనుంది.

హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కోట ఓట్లు 127 కాగా ఇందులో 9 ఖాళీగా ఉన్నాయి. ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 118 కాగా ఇందులో ఎంఐఎంకు 52, బీఆర్ఎస్‌కు 41, బీజేపీకి 25 ఓట్లు ఉన్నాయి. గెలుపు కోసం 60 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఉన్న సమీకరణాల నేపథ్యంలో సొంతంగా ఏ పార్టీ కూడా ఈ సీటును గెలవలేని పరిస్థితి. దీంతో ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా బీజేపీ బరిలో దిగితే గనుక ఓటింగ్ తప్పనిసరి కానుంది.

Advertisement

Next Story