- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు టికెట్ రాకుండా అడ్డుకుంది వాళ్లే.. MP సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ BJP MP సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తొలి జాబితాలో తనకు టికెట్ దక్కకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ నేతనైనా తనకు టికెట్ దక్కకుండా పావులు కదిపారని ఆవేదన చెందారు. తాను ఎక్కడ గెలుస్తానో అనే భయం వాళ్లకు పట్టుకుందని సీరియస్ కామెంట్స్ చేశారు. తాను కొమ్మపై ఆధారపడిన మనిషిని కాదని.. స్వతహాగా ఎదిగిన వ్యక్తిని అని అన్నారు. టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు నాదే.. గెలిచేది కూడా నేనే అని ధీమా వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వం విషయమై పార్టీ అధిష్టానం మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు. కాగా, 195 మందితో కూడిన పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను శనివారం సాయంత్రం బీజేపీ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. అందులో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు సిట్టింగులతో పాటు మరో ఆరుగురికి అవకాశం ఇచ్చింది. అనూహ్యంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు మొండిచేయి చూపించింది. దీంతో ఇవాళ మీడియా సమక్షంలో అసహనం వ్యక్తం చేశారు.