- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కోవడం సిగ్గుగా లేదా?: లక్ష్మణ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ఇరుక్కున్నందుకు మొత్తం తెలంగాణ మహిళా సమాజం సిగ్గుతో తల దించుకుంటున్నదని, అలాంటి స్కామ్‌లో ఇరుక్కోవడం ఆమెకు సిగ్గుగా అనిపించడంలేదా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. కాళేశ్వరం సాగునీరు కాల్వల్లో పారే సంగతేమోగానీ తెలంగాణలో మద్యం మాత్రం ఏరులై పారుతున్నదని అన్నారు. ఐదేళ్ళ పాటు ఎంపీగా ఉన్నప్పుడు ‘చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్’ గురించి ఏనాడూ పెదవి విప్పని కల్వకుంట్ల కవిత ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎండగట్టారు. ఏ ముఖం పెట్టుకుని ఈ అంశంపై ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దీక్ష చేస్తారని కవితను లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు తగిన గౌరవం, రక్షణ, స్థానం లేకుండా పోయిందన్నారు. మహిళలకు హత్యలు, అత్యాచారాలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఒక రోజు దీక్షలో పాల్గొన్న సందర్భంగా లక్ష్మణ్ పై వ్యాఖ్యలు చేశారు.
మహిళలకు నిజంగా కేసీఆర్ సర్కారుకు అక్కర ఉంటే ఇంతకాలం మహిళా స్వయం సహాయక బృందాలకు సుమారు రూ. 4,200 కోట్ల మేర బాకీలనుఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ తొలి టర్ములో రాష్ట్ర క్యాబినెట్‌లో మహిళలకు ఎందుకు స్థానం కల్పించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి అభ్యర్థిగా ఆడివాసీ ఆడబిడ్డ ద్రౌపది ముర్ము పోటీచేస్తే వ్యతిరేకించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏ విధానంతో మహిళా సాధికారత గురించి గొంతు చించుకుంటున్నదని ప్రశ్నించారు. తాజాగా డాక్టర్ ప్రీతి విషయంలోనూ ఇప్పటివరకూ కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు.