గుడి మీద కన్నేయాలంటే గజ్జుమనాలి.. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి సందర్శించిన ఈటల

by Ramesh N |   ( Updated:2024-10-18 10:52:00.0  )
గుడి మీద కన్నేయాలంటే గజ్జుమనాలి.. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి సందర్శించిన ఈటల
X

దిశ, డైనమిక్ బ్యూరో: హిందూ దేవుళ్ల గుళ్ళపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని రక్షపురంలో భూలక్ష్మి అమ్మవారు, ఉప్పుగూడ దేవాలయం, మైలార్ దేవ్ పల్లి ఆలయం, ఎగ్జిబిషన్ లో అమ్మవారి ఆలయం ఇప్పుడు సికింద్రాబాద్ కుమ్మర గూడ అమ్మవారి దేవాలయం మీద దాడి జరిగిందని తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయాన్ని ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి గుండెల మీద తన్నడమంటే, మన విశ్వాసం మీద ధర్మం మీద దాడి చేయడమేనని అన్నారు. ఇవే కాదు సంగారెడ్డి జిల్లా ఆంజనేయ స్వామి దేవాలయం, వినాయక విగ్రహం మీద దాడి.. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి.. సీఎం రేవంత్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ అమ్మవారి మీద దాడి చేసిన వాడు.. హాస్పిటల్ బెడ్ మీద దర్జాగా పడుకొని చాటింగ్ చేస్తున్నాడని, ఇంకా అవమానకర పోస్టులు పెడుతున్నాడన్నారు. అల్లానే ఈ పని చేయించాడు అని చెప్పుకుంటున్నారని, వాడి దగ్గర సెల్ ఫోన్ ఎలా ఉంది? వాడు మనిషా ? ఉన్మాదా ? అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం పట్టించుకోక పోతే కేంద్రం, మోడీ ప్రభుత్వం ఉక్కుపాదం పెడుతుందని స్పష్టంచేశారు. హిందూ మతం సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకుంటుందన్నారు. మన హైదరాబాద్ ఏ ప్రాంతం, ఈ మతం వారు ఇక్కడికి వచ్చినా అక్కున చేర్చుకొని చుట్టం లెక్క చూసుకుంటున్నారని తెలిపారు. అమెరికా, లండన్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఇండియన్స్ అంటే గొప్ప మర్యాద ఉంటుందన్నారు. మనవారు ఎక్కడ ఉన్నా భారత సంప్రదాయాలు కొనసాగిస్తున్నారని, ఏ దేశంలో మహిళలు గౌరవించబడతారో ఆ దేశం చల్లగా ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం భారత్.. అని తెలిపారు.

రేవంత్ దిక్కుమాలిన ఓట్ల రాజకీయం పక్కన పెట్టాలని, ఈ ఉన్మాదులకు కులం మతంతో సంబంధం ఉండదు పేదలే బలి అవుతున్నారని ఫైర్ అయ్యారు. సీపీ ఆనంద్‌కి సిటీ మీద సంపూర్ణ అవగాహన ఉంటుందని, హైదరాబాద్ క్షేమం కోరేవారని తెలిపారు. ఇది కేవలం విగ్రహం ధ్వంసం కోణంలో చూడకండని, అతని చేతికి సెల్ ఫోన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇలా చేస్తే ఎలా కంట్రోల్ అవుతుందని, అతని మీద పెట్టిన కేసులు సమీక్ష చేయాలని సూచించారు. హోటల్ మీటింగ్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు. వారు ఎక్కడి వారు. వారిని కూడా నియంత్రించాలన్నారు. కేంద్ర ఐబీ కూడా నిఘా పెట్టిందని తెలిపారు.

పాకిస్థాన్ లో ట్రైనింగ్ పొంది ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మీరు ఇక్కడికి ఎందుకు రారు.. వీటిని ఉపేక్షిస్తే చరిత్ర క్షమించదు సీఎం అంటూ నిలదీశారు. ప్రధాని మోడీ దేశం సురక్షితంగా భద్రంగా ఉండాలని, పరాయి దేశస్థులు కన్నెత్తి చూడకూడదు అని పని చేస్తున్నారని తెలిపారు. పక్కన ఉన్న మసీదులో 30 మంది ట్రైనింగ్ ఎలా ఇచ్చారని, తెలుసుకోవాలన్నారు. ఆపవలిసింది మా మహిళలని కాదు ఉన్మదులను.. మేము గోవులను పూజించే సాదువులం.. గోవులాంటి మమ్ముల్ని నియంత్రించే కంటే.. దుర్మార్గులను నియంత్రించండని సూచించారు. నేను పక్కనే పిలిస్తే పలుకుతూ.. నిశ్చింతగా ఉండండని ఎంపీ హామీ ఇచ్చారు. గుడి మీద కన్నేయాలంటే గజ్జుమనేల చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, సీపీ కి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed