Arvind MP: కేసీఆర్ మాటలు చాలా మిస్సవుతున్నా..

by Gantepaka Srikanth |
Arvind MP: కేసీఆర్ మాటలు చాలా మిస్సవుతున్నా..
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ మాటలను చాలా మిస్సవుతున్నట్లు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెలిపారు. ఉద్యమ సమయంలో ఆయన పులిలా ఉన్నారని, కానీ ఇప్పుడు పిల్లిలాగా అయ్యారని విమర్శలు చేశారు. రైతులకు అండగా నిలిచేందుకు బీజేఎల్పీ నేతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్షను సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. కేసీఆర్.. తెలంగాణను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోందని చురకలంటించారు. కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసిందని ఫైరయ్యారు. మాహేశ్వర్ రెడ్డి ఎల్పీ నేత అయినప్పటి నుంచి ఎన్నో స్కాములు, అవినీతిని బట్టబయలు చేశాడని అర్వింద్ తెలిపారు. కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో సీట్లు రాలేదని, వాళ్లకు గ్రామీణ ప్రాంతాల ఓట్లు వచ్చాయని, అందుకే గ్రేటర్ పరిధిలో పేదల ఇండ్లు కూలుస్తోందని మండిపడ్డారు.

గతంలో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రాగానే రాచరిక పాలన సాగించారన్నారు. ఆయనపై మాట్లాడితే.. కార్లు, ఇండ్లపై దాడులు జరిగాయని, అందుకే ప్రజలు కర్రు కాల్చి, వాత పెట్టి గద్దె దింపారన్నారు. తొమ్మిదేండ్లు తెలంగాణలో ప్రజా కంటగింపు పాలనను చూశామని ఆయన పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే నోటీస్ లేదు.. నేరుగా కూలుస్తున్నారంటూ అర్వింద్ మండిపడ్డారు. ముస్లింలను ఒకలా.. హిందువులను ఒకలా చూస్తున్నారని మండిపడ్డారు. హిందువుల ఇండ్లు మాత్రమే కూలుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా లేదు, బోనస్ ముచ్చటే లేదని విరుచుకుపడ్డారు. ప్రమాదవశాత్తు పంటనష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేడని పేర్కొన్నారు. కేసీఆర్.. ఒక ఎకరాకు రూ.కోటి సంపాదిస్తున్నాడని ఆయనే చెప్పారని, రూ.కోటి సంపాదన ఎలా సాధ్యమో స్టడీ చేసేందుకు ఒక టీమ్‌ను రేవంత్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపై ఆ విధానాన్ని రైతులకు గైడ్ చేయాలని పేర్కొన్నారు. ఇది రేవంత్‌కు తన పర్సనల్ రిక్వెస్ట్ అంటూ అర్వింద్ వ్యాఖ్యానించారు.

కేటీఆర్‌కు అల్లం, పసుపు ఇచ్చి ఏది ఏంటో చెప్పమంటే ఆయనేంటనేది తేలిపోతుందని అర్వింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ పిత కావల్సింది.. ఇద్దరు పిల్లలకు పితగానే మిగిలాడంటూ ఆయన సెటైర్లు వేశారు. పులికి పుట్టిన ఇద్దరు పిల్లలు అవినీతి చేసి జైలుకు పోతున్నారని, బెయిల్‌పై వస్తున్నారని చురకలంటించారు. కేసీఆర్‌లాగే వరి మాత్రమె వేసుకునే పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చిందని అర్వింద్ మండిపడ్డారు. చనిపోయిన ఇందిరమ్మను కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇంకా బద్నాం చేస్తున్నారని కాంగ్రెస్‌పై ఫైరయ్యారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని హామీ ఇచ్చారని, అలాగే విద్యార్థులకు ఇచ్చిన ఎన్నో హామీలు చూసి తనకు కూడా ఓటేయాలని అనిపించిందని అర్వింద్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పట్టడం ఖాయమని అర్వింద్ నొక్కిచెప్పారు. కేసీఆర్ పిల్లలకు కుక్క కూడా ఓటు వేయదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతలంతా ఇలాగే కలిసి కట్టుగా బలమైన అపొజిషన్‌గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని అర్వింద్ జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed