- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును హవాలా అడ్డాగా మార్చారు.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: లిక్కర్‌స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ కార్యాలయాన్ని మనీలాండరింగ్ కోసం వాడుకుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. తీహార్‌జైల్లో ఉన్న సుఖేశ్చంద్ర తాజాగా బుధవారం విడుదల చేసిన వీడియో ఛాటింగ్వివరాలనుబట్టి ఇది స్పష్టమవుతోందని చెప్పారు. సుఖేశ్ చంద్రను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన రఘునందన్‌రావు జైలు నుంచి సుఖేశ్చంద్ర రాసిన ఉత్తరం, విడుదల చేసిన వాట్సాప్ఛాటింగుకు సంబంధించిన జిరాక్స్ప్రతులను అధికారులకు అందచేశారు. అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. సుఖేశ్చంద్ర తాజాగా విడుదల చేసిన వాట్సాప్ఛాట్లను చూస్తే అతనికి బీఆర్ఎస్ పార్టీలోని మరికొందరు నాయకులతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా స్పష్టమవుతోందని చెప్పారు.
తెలంగాణ భవన్లో సుఖేశ్చంద్ర కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఛాట్లలో స్పష్టంగా ఉందన్నారు. పదిహేను కోట్ల రూపాయలను తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ అన్న స్టిక్కర్అతికించి ఉన్న 6060 నెంబర్బ్లాక్రేంజ్రోవర్కారులో ఉన్నవారికి అందచేసినట్టు సుఖేశ్చంద్ర వెల్లడించిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ నెంబరు ఉన్న కారు ఎవరిదన్నది తెలంగాణ రాష్ర్ట రవాణా శాఖ అధికారులు, పోలీసులు బయటపెట్టాలని డిమాండ్‌చేశారు. కారు ఎవరి పేరు మీద రిజిస్ర్టేషన్అయి ఉందన్నది వెల్లడించాలన్నారు. తెలంగాణ భవన్లోపలికి ఈ నెంబరు కారు రాలేదని సీసీ టీవీ ఫుటేజీని బయటపెట్టగలరా? అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. తాను డబ్బును అరుణ్పిళ్లైకి ఇచ్చినట్టు సుఖేశ్చంద్ర చెబుతున్నాని, అయినా అతన్ని కస్టడీలోకి తీసుకుని ఎందుకు విచారించటం లేదని ప్రశ్నించారు.
పార్టీ కార్యాలయాన్ని మనీలాండరింగ్కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. అందుకే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్నారు. సుకేశ్చంద్రను కస్టడీకి తీసుకుని నిశితంగా ప్రశ్నించాలన్నారు. సుఖేశ్చంద్ర విడుదల చేసిన వాట్సాప్ఛాటింగుల జిరాక్స్‌కాపీలను ఈడీ అధికారులకు అందచేసినట్టు తెలిపారు. ఈ సమాచారం మొత్తాన్ని లిక్కర్‌స్కాం కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ ఈడీ అధికారులకు అందచేస్తామని చెప్పారన్నారు. అక్కడి నుంచి సూచనలు అందితే తాము కూడా విచారణ జరుపుతామని ఈడీ అధికారులు చెప్పారని వివరించారు.
Also Read..