కాంగ్రెస్‌లో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

by Satheesh |   ( Updated:2023-05-18 09:00:32.0  )
కాంగ్రెస్‌లో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలన్నీ అవాస్తమని.. తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని ఎక్కడ చెప్పలేదని స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానంటూ వస్తోన్న వార్తలను ఖండించారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే తనపై దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు.

కర్నాటక ఫలితాలు వచ్చాక తనను కాంగ్రెస్‌లోకి రావాలని అడుగుతున్నారని.. కర్నాటకలో కాంగ్రెస్ గెలుస్తే తెలంగాణలో గెల్చినట్లా అని ప్రశ్నించారు. త్వరలో తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయన్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించేందుకు తాను బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీకి బండి సంజయే అధ్యక్షుడిగా ఉంటారని.. రాష్ట్ర బీజేపీ చీఫ్‌ను మార్చేందుకు ఎలాంటి లాబీయింగ్ జరగడం లేదని కోమటిరెడ్డి తెలిపారు.

Also Read..

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే అభిమానం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story