- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
18 రోజుల్లో 11,123 మీటింగ్స్.. రికార్డ్ సృష్టించిన T-BJP!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి బీజేపీ 11,123 వీధి సభలను నిర్వహించి సరికొత్త రికార్డును సృష్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. నిర్దేశించుకున్న వాటి కంటే ఎక్కువ మొత్తంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించడంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహణ కమిటీ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు, సభ్యులను సన్మానించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.
ప్రజలే బీజేపీ నాయకులకు భరోసా ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 18 రోజుల వ్యవధిలో 11,123 స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను నిర్వహించడమంటే మాటలు కాదన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలోనూ ఈ అంశంపై చర్చ జరిగిందని, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్ర నేతలు ప్రశంసించారని బండి సంజయ్ గుర్తుచేశారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 9,224 శక్తి కేంద్రాలకుగాను 11,123 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. స్థానిక నేతల్లో జోష్ నింపేందుకు ఈ మీటింగ్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ప్రతి గ్రామంలోనూ కాషాయ జెండాలు రెపరెపలాడాయన్నారు. ప్రారంభ, ముగింపు సభలను ఘనంగా నిర్వహించడంతోపాటు ఈ మీటింగ్స్ భవిష్యత్ కార్యక్రమాలకు మోడల్ గా నిలిచేలా చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఇదిలా ఉండగా 11,123 స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహించడంపై రాష్ట్ర నాయకత్వంపై కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసల జల్లులు కురిపంచారు. 165 మీటింగులతో మేడ్చల్ నియోజకవర్గం టాప్ ప్లేస్ లో ఉంది. 33 నియోజకవర్గాల్లో 100కిపైగా స్ట్రీట్ కార్నర్ మీటింగులు జరిగాయి. ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ వీధి సభలను విజయవంతం చేసి నేతలు సత్తా చాటడంపై జాతీయ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. పాతబస్తీలోనూ ఆశించిన స్థాయిలో సభలు నిర్వహించడాన్ని జాతీయ నాయకులు కొనియాడారు.