10 మందితో తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్.. ఆ రోజే విడుదల!

by GSrikanth |
10 మందితో తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్.. ఆ రోజే విడుదల!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 24న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి ఈ సమావేశానికి లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఈటల, సంజయ్, డీకే అరుణ హాజరు కానున్నారు. మొదటి జాబితాలో పదిమంది వరకు అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశ నేపథ్యంలో అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మార్చి 2వ తేదీన అమిత్ షా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. పది సీట్లకు తగ్గకుండా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

ఈ నేపథ్యంలో ఆ దిశగా కార్యచరణ సైతం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభించనుంది. మొత్తం 17 నియోజకవర్గాల పరిధిలో ఐదు క్లస్టర్లుగా ఈ యాత్ర కొనసాగనుంది. ఇందులో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలతో పాటు 79 ఈవెంట్స్‌ను బీజేపీ నిర్వహించనుంది. సుమారు 12 రోజులపాటు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర కొనసాగనుంది.

Advertisement

Next Story