- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Maharashtra: దేశానికి పదేళ్లు ఓబీసీ ప్రధాని: మహారాష్ట్రలో పీఎం మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: ఈ దేశానికి పదేళ్లుగా ఒక ఓబీసీ ప్రధానమంత్రి(OBC Prime Minister)_గా సేవలు అందిస్తున్నారని, ఆ ఓబీసీ ప్రధాని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తున్నారని మహారాష్ట్ర ప్రచారంలో నరేంద్ర మోడీ(PM Narendra Modi) అన్నారు. దేశానికి ఒక ఓబీసీ ప్రధానిగా ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ(Congress Party) జీర్ణించుకోవడం లేదని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం ఓబీసీకి ఉన్న సమైక్య గుర్తింపును నాశనం చేయాలని, వారిని చిన్న చిన్న కులాలుగా విభజించాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కాబట్టి, కాంగ్రెస్ కుట్రలపట్ల అప్రమత్తంగా ఉండాలని, ‘మనమంతా ఏకమై ఉంటేనే సురక్షితంగా ఉంటాం’ అని మహారాష్ట్ర ప్రచార కార్యక్రమంలో వివరించారు.
అంబేద్కర్‌పై గౌరవం లేదు
కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై గౌరవం లేదని, జమ్ము కశ్మీర్ దళితుల హక్కులను దశాబ్దాలపాటు కాలరాసిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ ఫేక్ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగం అని రెడ్ బుక్‌ను చేతపట్టుకుని తిరుగుతున్నారని, తీరా చూస్తే.. అది ఖాళీ పుస్తకమన్నారు. ఈ ఖాళీ పుస్తకాన్ని వారు పంచుతూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. ఇది బాబా సాహెబ్ పై వారికి ఉన్న చిన్న చూపు అని విమర్శించారు. దశాబ్దాలుగా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదం వేళ్లూనుకుందని తెలిపారు. దేశంలో రెండు రాజ్యాంగాలు అమలవుతున్నాయన్న విషయాన్ని దశాబ్దాలుగా దేశ ప్రజలకు తెలియకుండా కాంగ్రెస్ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఆర్థిక వనరులుగా వాడుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజకుటుంబానికి ఏటీఎంగా మారుతోందని మండిపడ్డారు.