Virat Kohli : భారీ స్కోర్ చేసేది అప్పుడే అంటూ.. కోహ్లికి రికీ పాంటింగ్ సపోర్ట్

by Sathputhe Rajesh |
Virat Kohli : భారీ స్కోర్ చేసేది అప్పుడే అంటూ.. కోహ్లికి రికీ పాంటింగ్ సపోర్ట్
X

దిశ, స్పోర్ట్స్ : ఫామ్ లేమితో బాధ పడుతున్న టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మద్దతుగా నిలిచాడు. కోహ్లి 2014-2019 వరకు 60 యావరేజ్ కొనసాగించాడని గుర్తు చేశాడు. 2020 నుంచి 31.68 యావరేజ్ ఉందని.. 2014-19 మధ్య కోహ్లి 21 సెంచరీలు చేశాడని గుర్తుచేశాడు. 2020 తర్వాత ఇప్పటి వరకు 2 సెంచరీలు చేశాడన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వస్తాడని పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లి ‘గ్రేట్ ఆఫ్ ది గేమ్’ అని అతన్ని ప్రశ్నించడం మానుకోవాలని హితవు పలికాడు. ఆస్ట్రేలియాతో ఆడటాన్ని కోహ్లి ఇష్టపడతాడని పాంటింగ్ అన్నాడు. కంగారులపై కోహ్లికి మంచి రికార్డు ఉందని తెలిపాడు. ఈ సిరీస్‌తో మళ్లీ కోహ్లి పునర్వైభవం కొనసాగిస్తాడని.. ఆస్ట్రేలియాతో తొలి గేమ్‌లోనే విరాట్ భారీ స్కోర్ చేస్తాడని పాంటింగ్ అన్నాడు.

Next Story

Most Viewed