- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
CM Nitish Kumar : వాజ్‌పేయి వల్లే సీఎం అయ్యాను : సీఎం నితీశ్
దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి(Vajpayee) వల్లే తన కెరీర్‌లో తొలిసారి సీఎం అయ్యానని బిహార్ సీఎం నితీశ్‌కుమార్(CM Nitish Kumar) తెలిపారు. ‘‘వాజ్‌పేయి మహానుభావుడు.. ఆయన నన్ను చాలా లైక్ చేశారు. అందుకే సీఎం అయ్యే అవకాశం నాకు వచ్చేలా చేశారు’’ అని నితీశ్ గుర్తు చేసుకున్నారు. తనకు ఎంతో మేలు చేసిన ఎన్‌డీఏ కూటమిని వదిలేసి.. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)తో చేతులు కలిపి రెండుసార్లు తప్పు చేశానన్నారు. ‘‘నేను రెండుసార్లు తప్పుడు వ్యక్తులతో చేతులు కలిపాను. అయితే వారు తప్పు చేస్తున్నారని తేలడంతో మళ్లీ ఎన్‌డీఏ కూటమిలోకి వచ్చేశాను. ఇక ఎన్‌డీఏను వీడేది లేదు’’ అని సీఎం నితీశ్ స్పష్టం చేశారు.
శనివారం బిహార్‌లోని అర్రా నగరంలో జరిగిన ఉప ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి విశాల్ ప్రశాంత్‌కు మద్దతుగా నితీశ్ ప్రచారంలో పాల్గొన్నారు. ‘‘ఆర్‌జేడీ కేవలం ముస్లింల ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంది. అయితే వాళ్ల కోసం ఆర్‌జేడీ ఎలాంటి పని చేయలేదు. మేం అందరి కోసం పని చేస్తాం. మేం ఉన్నంత కాలం హిందువులు, ముస్లింలను ఒకేలా చూస్తాం’’ అని ఆయన తేల్చి చెప్పారు.