Joe Biden : నవంబరు 13న బైడెన్‌తో ట్రంప్ భేటీ

by Hajipasha |
Joe Biden : నవంబరు 13న బైడెన్‌తో ట్రంప్ భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా పాలిటిక్స్‌లో బుధవారం (నవంబరు 13న) కీలక పరిణామం జరగబోతోంది. ఆ రోజున వైట్ హౌస్ వేదికగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌‌(Joe Biden)ను కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కలవనున్నారు. పరస్పర విమర్శలతో రాజకీయంగా ఘర్షణ పడిన ఈ ఇద్దరు దిగ్గజ నేతలు ఒకచోట కలవడం ఇదే తొలిసారి. బైడెన్ ఆహ్వానం మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు వైట్‌ హౌస్‌కు ట్రంప్ రానున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్ పియెరీ ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశాధ్యక్షుడి అధికారిక కార్యాలయంలో ఈ ఇద్దరు నేతలు సమావేశమవుతారని తెలిపారు.

అధికార బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు భేటీ కావడం అనేది అమెరికాలో ప్రజాస్వామిక సంప్రదాయంగా వస్తోంది. అయితే 2020లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు.. ఈ సంప్రదాయాన్ని పాటించకుండానే వైట్ హౌస్‌ నుంచి వెళ్లిపోయారు. ఫలితంగా బైడెన్ నేరుగా వైట్ హౌస్‌కు వెళ్లి పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed