Donald Trump :ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి రెడీ!

by Mahesh Kanagandla |
Donald Trump :ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి రెడీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: సంవత్సరాల తరబడి సాగుతున్న ఉక్రెయిన్(Ukraine) యుద్ధానికి తెరదించడానికి రష్యా(Russia) సంకేతాలు ఇస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన శాంతి ప్రతిపాదన(Peace Proposal)ను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యాకు చెందిన ఓ సీనియర్ అధికారిక ఆ దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఇంటర్‌ఫాక్స్‌కు తెలిపారు. ఉక్రెయిన్ విషయమై మాస్కో, వాషింగ్టన్ కొన్నాళ్లుగా రహస్య చానెళ్ల గుండా సంప్రదింపులు జరిపిందని రష్యా డిప్యూటీ ఫారీన్ మినిస్టర్ సెర్జి ర్యాబ్కోవ్ వివరించారు. బైడెన్ అధికారయంత్రంగంతోనా? లేక ట్రంప్, ఆయన రాబోయే అధికారులతో ఈ చర్చలు జరిగాయా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ట్రంప్ చేసిన పీస్ ప్రపోజల్‌కు రష్యా రెడీ అని తెలిపారు. కీవ్‌కు అన్ని విధాల సహకారమందించి యుద్ధాన్ని కొనసాగించడానికి బదులు పురోగతివైపు ఆలోచనలు ఉన్నాయని, అందుకే తాము ఆ ఆలోచలను స్వీకరించడానికి సిద్ధమేనని ఆయన శనివారం చెప్పారు. రిపబ్లికన్ల పాలనలో యుద్ధాలు ఆగిపోతాయని, తాము కొత్తగా యుద్ధాలకు పోమని డొనాల్డ్ ట్రంప్ ఇది వరకే పలుమార్లు స్పష్టం చేశారు. యుద్ధాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి తాము కృషి చేస్తామని వివరించారు. ఉక్రెయిన్ ప్రజలు, ప్రభుత్వమూ డెమోక్రటిక్ పార్టీ గెలవాలని ఆశించాయి. కానీ, ట్రంప్ గెలవడంతో ఉక్రెయిన్‌లో నిరుత్సాహం కనిపించింది. రష్యాపై యుద్ధం కొనసాగించడానికి కొత్తగా కొలుదీరే రిపబ్లికన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు పూర్తిస్థాయిలో సహకారం అందించకపోవచ్చనే భయాలు ఆ నిరుత్సాహానికి కారణం. ట్రంప్ ఇంకా బాధ్యతలు తీసుకోకముందే రష్యా నుంచి ఇలాంటి సంకేతాలు రావడం గమనార్హం.

Advertisement

Next Story