- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
PKL 11 : డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాక్.. తెలుగు టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ
దిశ, స్పోర్ట్స్ : ప్రో కబడ్డీ 11 సీజన్‌లో భాగంగా శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పుణెరి పల్టాన్‌పై 34-33 తేడాతో తెలుగు టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు ఇది వరుసగా నాలుగో విజయం. కెప్టెన్ పవన్ షెరావత్ 12 పాయింట్లు, విజయ్ మాలిక్ 13 పాయింట్లు సాధించడంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన తెలుగు టైటాన్స్ పాయింట్స్ పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. స్టార్టింగ్ నుంచి నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు హైదరాబాద్ టైటాన్స్‌ను విజయం వరించింది. పుణేరి పల్టాన్ మ్యాచ్ ఆరంభంలో పంకజ్ మోహితే సూపర్ రైడ్, మోహిత్ గోయత్ సూపర్ ట్యాకిల్‌తో లీడ్‌లోకి వచ్చింది. సెకండాఫ్‌లో చివరి వరకు పాయింట్లు సమానంగా వచ్చినా ఒక్క పాయింట్ తేడాతో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. అయితే ఆ జట్టు తరఫున పంకజ్ 9, అజిత్ కుమార్ 6, మోహిత్ 5 పాయింట్లు సాధించారు.