FIFA WORLD CUP 2026 : ట్రంప్ గెలుపుతో కొత్త కాంట్రవర్సీ

by Sathputhe Rajesh |
FIFA WORLD CUP 2026 : ట్రంప్ గెలుపుతో కొత్త కాంట్రవర్సీ
X

దిశ, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఈ సారి మూడు నార్త్ అమెరికన్ కంట్రీలు యూఎస్ఏ, కెనడా, మెక్సికోలలో జరగనుంది. తొలిసారి మూడు దేశాల్లో ఈ టోర్నీ జరగనుంది. 1994 తర్వాత జరిగే ఫస్ట్ నార్త్ అమెరికన్ వరల్డ్ కప్ ఇదే. ఫైనల్ మ్యాచ్ యూఎస్ ఈస్ట్ రూథర్ ఫర్డ్‌లోని మెట్ లైఫ్ స్టేడియంలో జరగనుంది. డోనాల్డ్ ట్రంప్ విజేతలకు టోర్నీని అందించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ వీసా అప్లికేషన్‌లు పొందడం మరింత కఠినం చేస్తామన్నారు. దీంతో వరల్డ్ కప్‌పై ఈ ప్రభావం పడనుంది. ట్రంప్ 2016-20లో ప్రెసిడెంట్‌గా ఉండగానే 2026 వరల్డ్ కప్ బిడ్డింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో వీసా ఆంక్షలు కఠినతరం అయితే మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే ఫ్యాన్స్ ట్రావెల్ మరింత ఆలస్యం కానుంది.

Advertisement

Next Story

Most Viewed