Amit Shah: మీ నాలుగో తరమొచ్చిన.. కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా ఫైర్

by Mahesh Kanagandla |
Amit Shah: మీ నాలుగో తరమొచ్చిన.. కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రాహుల్ గాంధీ(Rahul Gandhi) పణంగా పెట్టి మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందని, ఉలేమాలు కలవగానే మైనార్టీలకు పది శాతం రిజర్వేషన్ల హామీని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇచ్చారని మండిపడ్డారు. జార్ఖండ్‌లోని జేఎంఎం ప్రభుత్వం చొరబాటుదారులకు ఎర్రతివాచీ పరుస్తున్నదని, చొరబాటుదారులు జార్ఖండ్ బిడ్డలను పెళ్లి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. హజారీబాగ్‌లో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని, మూడు నెలల్లో భూమిపూజ చేస్తామని హామీ ఇచ్చారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ సాధ్యం కాదని, కాంగ్రెస్ కుటుంబం నాలుగో తరం వచ్చినా వెనక్కి తీసుకురాలదేని స్పష్టం చేశారు. జేఎంఎం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అవినీతిపరులను ఎవరినీ వదిలిపెట్టబోమని పేర్కొన్నారు.

చొరబాటుదారులను ఏరేస్తాం..

జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న విశ్వాసాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda).. స్థానిక గిరిజనుల ప్రజల హక్కులను కాపాడటానికి కట్టుబడి ఉన్నదని వివరించారు. చొరబాటుదారులు ఇక్కడి ఆదివాసీ బిడ్డలను పెళ్లి చేసుకుంటున్నారని, వారికి పుట్టిన పిల్లలకు గిరిజన హోదా కల్పించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ పార్టీ కచ్చితత్వంతో వ్యవహరిస్తుందని తెలిపారు. జార్ఖండ్‌ నుంచి ప్రతి చొరబాటుదారుని, ప్రతి బంగ్లాదేశీని ఎరివేస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed