రేవంత్ బాబా 11 మంది దొంగలు.. బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
రేవంత్ బాబా 11 మంది దొంగలు.. బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేవంత్ బాబా 11 మంది దొంగల పాలన కొనసాగుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చూసినా చీకటి ఒప్పందాలు చేస్తూ అవినీతి మయం అయిందని ఆరోపించారు. జవాబు దారీతనం, పారదర్శకత లేని ప్రభుత్వం తెలంగాణ ఉందన్నారు. ప్రజాదర్భార్ కనిపించకుండా పోయిందన్నారు. ప్రజాపాలన పేరు మీద రక్షాస పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. బీ, ఆర్, యూ ట్యాక్స్‌లతో అవినీతి నిండిపోయిందన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టును గ్లోబల్ టెండర్ వేయాల్సిందే అని డిమాండ్ చేశారు. నిన్న బీజేఎల్పీ మీటింగ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామన్నారు. ఇన్ని రోజులు చేసిన ఆరోపణలు అన్నింటి మీద బీజేఎల్పీలో చర్చించి పోరాటానికి సిద్ధం అవుతామన్నారు.

Advertisement

Next Story