- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ లో బీహార్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం
దిశ, డైనమిక్ బ్యూరో:
హైదరాబాద్ లో బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది.క్యాంప్ పాలిటిక్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన బిహార్ ఎమ్మెల్యేలు తిరిగి బిహార్ కు బయలుదేరేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లగా అక్కడ విమానం బయలుదేరక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ పరిస్థితిపై బిహార్ ఎమ్మెల్యేలు ఏయిర్ పోర్ట్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో నితీశ్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకునే పనిలో భాగంగా కాంగ్రెస్ కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీ హైదరాబాద్ క్యాంపుకు తరలించింది. రేపు (సోమవారం) అసెంబ్లీలో నితీశ్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోనున్నది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను హైదరాబాద్ నుంచి బిహార్ కు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని పార్టీ నేతలు ఆదివారం సిద్ధం చేశారు. 19 మంది బీహార్ ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అయితే గంటన్నర గడిచిన విమానం బయలుదేరలేదు. దీంతో ఎమ్మెల్యేలంతా ఎయిర్ పోర్ట్ లోనే పడిగాలు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.