ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి మరో కొత్త అంశం..!

by Satheesh |   ( Updated:2023-01-06 10:40:11.0  )
ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి మరో కొత్త అంశం..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో రోజుకో ట్విస్ట్ నమోదు అవుతోంది. శుక్రవారం ఈ కేసులో మరో అనూహ్య అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసులో తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే నిజానికి బీఆర్ఎస్ పార్టీనే పెద్ద ఎత్తున ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు గురి చేసిందని.. ఈ కేసులో బీజేపీ తరపు న్యాయవాది వాదిస్తున్నారు. 2014 నుంచి 2018 వరకు బీఆర్ఎస్ పార్టీ వివిధ పార్టీలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుందని ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు బీఆర్ఎస్‌లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల జాబితాను మరి కాసేపట్లో హైకోర్టుకు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుందని బీజేపీ వాదించబోతోంది. ఈ అనూహ్య పరిణామంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది. మరో వైపు ఈ కేసు విచారణను సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి: ఎస్‌ఐపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు..

Advertisement

Next Story

Most Viewed