Big News: ఆ 11 జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్‌ శాంతికుమారి కీలక సూచన

by Shiva |   ( Updated:2024-09-03 15:39:00.0  )
Big News: ఆ 11 జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్‌ శాంతికుమారి కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రాష్ట్రంలో వర్ష, వరద బీభత్సం సృష్టించిన ఘటన మరువక ముందే ఈనెల 5న మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఈ పరిణామల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ మరోసారి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల్లో వరద పరిస్థితులు, పునరావాసం, సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story