BIG News: గ్రేటర్ విస్తరణ లేనట్టే.. ! జీహెచ్ఎంసీ పరిధి యథాతథం

by Shiva |   ( Updated:2024-09-04 15:55:41.0  )
BIG News: గ్రేటర్ విస్తరణ లేనట్టే.. ! జీహెచ్ఎంసీ పరిధి యథాతథం
X

దిశ,తెలంగాణ బ్యూరో : ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ఉన్న గ్రామాలను ఆర్బన్ ఏరియా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ని 51 గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. ఆ గ్రామాల్లో ఆర్బనైజెడ్ పాటర్న్ అడ్మినిస్ట్రేషన్ అవసరం అని నిపుణుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఆర్డినెన్స్ లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంపీ పరిధిలో మార్పులు, చేర్పులు ఉండవని, ఔటర్ చుట్టూ ఉన్న గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశా మని అధికార వర్గాలు వెల్లడించాయి.

విలీనం కోసం సుదీర్ఝ కసరత్తు

ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న గ్రామాలను సమీప గ్రా మాల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా సుదీర్ఘంగా కసరత్తు చే సింది. అందుకోసం అడ్మినిస్ట్రేషన్ స్టాప్ కాలేజ్ ఆ ఫ్ ఇండియాకు (ASCI) ఆధ్యయనం బాధ్యతలు అప్పగించింది. ఆ కాలేజీకి చెందిన నిపుణులు ఔట ర్ చుట్టూ ఉన్న మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జి ల్లాలకు సమీప గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్న జీవన విధానాలు, పాలనా అంశాలపై స్డడీ చేశా రు. ఆ గ్రామాల్లో అర్బన్ గవర్నెన్స్ పాటర్న్ అవస రం వంటి సలహా ఇవ్వడంతో ప్రభుత్వం జిల్లా అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే ఏఏ గ్రామాలను మున్నిపాలిటీల్లో విలీనం చేయాలనే అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం (చై ర్మన్ శ్రీధర్ బాబు, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీత క్క, దామోదర్ రాజనర్సింహ్మా) స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నది. మొత్తం 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. గ్రామాల విలీనంతో పాటు 13 మున్సిపాలిటీల్లో పెంచిన వార్డుల సంఖ్యను కూడా పేర్కొన్నారు.

ఒకేతీరు పాలన

ఇక నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ఒకేతీరు అడ్మినిస్ట్రేషన్ అమల్లోకి రానుంది. రోడ్లు, పారిశు ద్యం, మంచినీటి సరఫరా లో తారతమ్యాలు ఉం డవు. ఇప్పటికే ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, సమీప గ్రామాల మధ్య కొత్త కాలనీలు, విల్లాలు ఏర్పడ్డాయి. అయితే మున్సిపాలిటీల్లో విశాలమైన రోడ్లు ఉండటం, సమీ ప గ్రామాల్లోని రోడ్లు చిన్నవిగా ఉండటంతో ట్రాఫి క్ సమస్యలు వచ్చాయి. అలాగే డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ విషయాల్లో కూడా సమస్యలు రావడం తో ఒకేతీరు ఆడ్మినిస్ట్రేషన్ అవసరం అనే డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. దీంతో ఔటర్ చుట్టూ ఉన్న గ్రామాలన్నింటినీ మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

మున్సిపాలిటీ విలీన గ్రామాలు వార్డులు

మేడ్చల్ జిల్లా

మేడ్చల్ పూడూరు, రైలాపూర్ 23

దమ్మాయిగూడ కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి,

చీర్యాల్, నర్సంపల్లి, తిమ్మాయిపల్లే 18

నాగారం బోగారం, గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి 20

పోచారం వెంకటాపూర్, ప్రతాప్ సింగారం, కొర్రెముల్ల,

కాచవానిసింగారం, చౌదరిగూడ 18

ఘట్కేసర్ అంకుశాపూర్, అవుశాపూర్, మాధారం,

ఎదులాబాద్, ఘణపూర్, మర్పెల్లిగూడ 18

గుండ్ల పోచంపల్లి మున్నీరాబాద్, గౌడవెల్లి 15

తూముకుంట బొమ్మరాశిపేట, శామీరపేట, బాబాగూడ 16

రంగారెడ్డి జిల్లా

పెద్ద అంబర్ పేట బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట్ 24

శంషాబాద్ బహదూర్ గూడ, పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ,

హమిదుల్లానగర్, రషీద్ గూడ, ఘాన్సిమియాగూడ 25

నార్సింగ్ మిర్జాగూడ 18

తుక్కుగూడ హర్షగూడ 15

సంగారెడ్డి జిల్లా

తెల్లాపూర్ కర్దనూర్, ముత్తంగి, పోచారం, పాటి, ఘణపూర్ 17

అమీన్‌పూర్ ఐలాపూర్, ఐలాపూర్ తండా, పటేల్ గూడ, దయర,

కిష్టారెడ్డిపేట్, సూల్తాన్ పూర్ 24

యథాతధంగా గ్రేటర్ : మంత్రి పొన్నం

ప్రస్తుతం 150 డివిజన్లతో ఉన్న గ్రేటర్ హైదరాబాదుకు, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ పరిసరాల్లో ఉన్న గ్రామాల్లో ఒకేతీరు పాలన అవసరం అనే ఉద్దేశంతోనే 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశామని తెలిపారు. అలాగే హైడ్రాకు, కొత్తగా జారీచేసిన ఆర్డినెన్స్ కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story