Big Breaking: మహిళలకు ఫ్రీ బస్.. RTC కీలక నిర్ణయం

by Kavitha |
Big Breaking: మహిళలకు ఫ్రీ బస్.. RTC కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ స్కీమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి బస్సులలో సీట్లు దక్కక చాలా మంది ఇక్కట్లు పడుతున్నారు. ఉచిత బస్సు కావడంతో మహిళలే ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. దీంతో పురుషుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పైసలు పెట్టి టికెట్ తీసుకున్న కానీ, నిలబడి వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ క్రమంలో RTC వ్యూహాత్మకంగా పాత రాజధాని AC బస్సులకు మార్పులు చేర్పులు చేసి సెమీ డీలెక్స్‌లుగా నడుపుతుంది. అయితే వీటిలో మహిళలకు ఫ్రీ కాకపోవడమే కాకుండా EXPRESS బస్సులలో కంటే 10% అధికంగా చార్జీలు ఉంటాయి. అంతే కాకుండా పల్లె వెలుగు బస్సులలో కంటే ఈ బస్సుల్లో 5 సీట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో బస్సులో ఎక్కే వారి సంఖ్య పెరుగుతుంది, ఆదాయం కూడా సమకూరుతుంది. కాగా ప్రస్తుతం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. త్వరలో మిగతా జిల్లాల్లో కూడా విస్తరించనున్నారు.

Advertisement

Next Story