బిగ్ బ్రేకింగ్ : ఇండియా - ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కి యత్నం

by Sathputhe Rajesh |
బిగ్ బ్రేకింగ్ : ఇండియా - ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కి యత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: మార్చి 19న వైజాగ్‌లో జరిగిన ఇండియా - ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో ఫిక్సింగ్ కి ప్రయత్నాలు జరగడం సంచలనం సృష్టించింది. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను ఫిక్సింగ్ అంశమై ఏపీకి చెందిన వ్యక్తి కలుసుకున్నట్లు తెలిసింది. బెట్టింగ్ లో చాలా డబ్బు పోగొట్టుకున్నానని సదరు వ్యక్తి సిరాజ్‌కు తెలిపాడు. సిరాజ్ వాట్సాప్ కు ఇదే విషయమై మెసెజ్ లు పెట్టినట్లు సమాచారం. వెంటనే విషయాన్ని సిరాజ్ బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు. సిరాజ్ కు మెసెజ్ చేసిన వ్యక్తిని వైజాగ్ కు చెందిన డ్రైవర్‌గా గుర్తించారు. అయితే అతనికి ఏ గ్యాంగ్ తోన సంబంధం లేదని పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులో డ్రైవర్ ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Next Story