MP Elections : సొంతూళ్లకు వెళ్తున్నారా.. TS‌RTC, రైల్వే శాఖ బిగ్ అలర్ట్

by Rajesh |
MP Elections :  సొంతూళ్లకు వెళ్తున్నారా.. TS‌RTC, రైల్వే శాఖ బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌ టైం సమీపిస్తుండటంతో ఓటు వేసేందుకు సొంతూళ్లకు నగరవాసులు క్యూ కట్టారు. ప్రయాణికుల రద్దీతో బస్‌‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. దాదాపు 2 వేల బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను ప్రయాణికుల రద్దీ మేరకు ఆర్టీసీ నడపుతోంది. ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. రేపు, ఎల్లుండి సికింద్రాబాద్-విశాఖ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.

Advertisement

Next Story