Bhatti Vikramarka: పేదల భూములు అమ్ముకున్న దుర్మార్గులు.. బీఆర్ఎస్ పై భట్టి ఫైర్

by Prasad Jukanti |
Bhatti Vikramarka: పేదల భూములు అమ్ముకున్న దుర్మార్గులు.. బీఆర్ఎస్ పై భట్టి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక్కో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా బీఆర్ఎస్ (BRS) అభివృద్ధి చేయలేదు కాబట్టి మిగతా వారు కూడా అభివృద్ధి చేయడం లేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఇంకా భ్రమల్లో ఉంటే అది వారి ఖర్మ అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి భట్టి విక్రమార్క ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ (kCR), కిషన్ రెడ్డి ఇద్దరు ఒక్కటేనని ఒక్కటేనని అందుకే తమ పాలనపై కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని విమర్శిస్తున్నారని తమ ప్రభుత్వం చేసిన పనులు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.

అమాయకులను రెచ్చగొట్టి కలెక్టర్ పై దాడి:

రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. భూములు కోల్పోతున్న వారి బాధను అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ 2013 భూసేకరణ చట్టం తీసుకువచ్చామన్నారు. లగచర్లలో కొద్ది మంది కావాలనే కుట్ర పూరితంగా అమాయక ఎస్సీ, ఎస్టీలను రెచ్చగొట్టి కలెక్టర్ పై భౌతిక దాడి చేయించారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగా ఎక్కడా బలవంతంగా భూములు లాక్కోవడం లేదన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రైతుల వద్ద నుంచి అసైండ్ ల్యాండ్ ను గుంచుకుని వేలం వేసి, లే అవుట్లు వేసుకుని అమ్ముకున్న దుర్మార్గులు మీరు అని ఫైర్ అయ్యారు. అలాంటి మీరు ఇవాళ ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అందరికీ నచ్చజెప్పే పరిశ్రమలకు భూములు తీసుకుంటామని నిర్వాసితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నామన్నారు.

వారే ఇందిర చరిత్రను వక్రీకరిస్తున్నారు:

దేశ సమక్యత, సమగ్రత కోసం ఇందిరా గాంధీకృషి చేశారని గతం తెలియని వారు, దేశాభిమానం లేని వారే ఇందిర చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారని గుర్తు చేశారు. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొంమదే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఇందిరమ్మ స్పూర్తితో మహిళలకు పథకాలు అందజేస్తామన్నారు. వరంగల్ లో ఇందిరా మహిళా శక్తిని చాటి చెప్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed