‘పోలీసులు అనవసర ఆంక్షలు విధిస్తే నగరాన్ని దిగ్భందిస్తాం’

by GSrikanth |
‘పోలీసులు అనవసర ఆంక్షలు విధిస్తే నగరాన్ని దిగ్భందిస్తాం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్యాంక్ బండ్‌పై క్రేన్లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్‌పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి కార్యదర్శి డా॥ రావినూతల శశిధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం హిందువుల విశ్వాసాలతో ఆటలు ఆడితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

గణేష్ నిమజ్జనంపై పోలీసులు విధిస్తున్న అనవసర ఆంక్షలపై భాగ్యనగరంలోని హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని, వెంటనే సరైన చట్టపరమైన చర్యలు చేపట్టి గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గణేష్ నిమజ్జనం భాగ్యనగర సాంస్కృతిక వైభవమని ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీసు అడ్డుగోడలు సృష్టించినా గురువారం భక్తులు, ప్రజలు యధావిధిగా నిమజ్జనోత్సవం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story