Bhadradri సీతారాముల కల్యాణ తేదీ ఖరారు

by GSrikanth |   ( Updated:2023-02-07 06:22:16.0  )
Bhadradri సీతారాముల కల్యాణ తేదీ ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి సీతారాముల కల్యాణ తేదీని వైదిక కమిటీ ఖరారు చేసింది. మార్చి 30వ తేదీన కల్యాణం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అనంతరం 31వ తేదీన పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి తిరకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుక, వసంతోత్సవం, డోలోత్సవాన్ని ప్రతి యేట మాదిరిగానే ఈ సారి కూడా ఘనంగా నిర్వహించనున్నారు. వేలాది సంఖ్యలో వచ్చే భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు..

Also Read..

07 ఫిబ్రవరి : నేడు శుభ, అశుభ సమయాలివే

Advertisement

Next Story