బీసీ కులాల ఆత్మగౌరవ సభ.. బండి సంజయ్‌కి ఆహ్వానం

by Vinod kumar |
బీసీ కులాల ఆత్మగౌరవ సభ.. బండి సంజయ్‌కి ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో తొలగించబడిన 26 బీసీ కులాల ఆత్మ గౌరవ సభను ఈనెల 25వ తేదీన నిర్వహిస్తున్నట్లు 26 బీసీ కులాల పోరాట సమితి, గౌరీ సంఘం నాయకులు శుక్రవారం తెలిపారు. తొలగించిన 26 బీసీ కులాలను వెంటనే కలపాలని, బీసీ కమిషన్ సుప్రీంకోర్టుకు అనుకూలంగా నివేదిక సమర్పించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ తిరుమలగిరిలో సూర్య టెంపుల్ పక్కన గౌరీ భవనంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన ఈ సభ ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. కాగా, పలు రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానం అందించినట్లు వారు తెలిపారు.

ఈమేరకు శుక్రవారం బండి సంజయ్‌కి సైతం ఆహ్వానాన్ని అందజేశారు. తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కాసాని జ్ఞానేశ్వర్, షర్మిల, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హాజరవుతారన్నారు. కావున వివిధ బీసీ సంఘాలు, రాజకీయ పక్షాల నాయకులు, బీసీ కులస్తులు సభకు హాజరుకావాలని 26 బీసీ కులాల పోరాట సమితి, గౌరీ సంఘం నాయకులు కోరారు.

Advertisement

Next Story

Most Viewed