- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bandi Sanjay : విజయోత్సవాలు కాదు.. వంచన ఉత్సవాలు చేయండి: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రైతులు కొనుగోలు కేంద్రాల్లో కష్టాలు పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వెల్లడించారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టు వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. రుణమాఫీ, బోనస్, రైతు భరోసా ఇచ్చామని అనేక రకాల అబద్ధాలు చెప్పారని విమర్శించారు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, కానీ ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళ్లి రుణమాఫీ మొత్తం చేశామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. వ్యవసాయం మంత్రి ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని ఆయన అంటున్నారని చెప్పారు. వారి ఇద్దరి మధ్య పొంతన లేదన్నారు.
ఇక కొనుగోలు విషయంలో ప్రతిసారి ఇదే పరిస్థితి అని ఫైర్ అయ్యారు. పోయిన సారి రైతులు ఇబ్బంది పడ్డారని అన్నారు. ఈ సారి కొనుగోళ్ల విషయంలో ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు రైతుల పరిస్థితి అయిందని సామెత చెప్పారు. 1700 కొనుగోలు సెంటర్లు ఇప్పటికి ప్రారంభించలేదని అన్నారు. ప్రాంభించిన కేంద్రాల్లో ఇంకా కొనుగోలు స్టార్ట్ అవ్వలేదని ఆరోపించారు. నెల రోజుల నుంచి వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఉందని, వాటికి రైతులు కావలి కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోనస్ పైసలు తప్పించుకోడానికి కొనుగోలు సరిగా చేయడం లేదని ఆరోపించారు.
కొనుగోలు సెంటర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని అక్కడ కాదని విమర్శించారు. కేంద్రం రాష్ట్రం మంచి ఆలోచనతోని ముందుకు పోతే న్యాయం జరుగుతుందని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి సహకరించే ఆలోచన లేదని ఆరోపించారు. ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతుంటే.. విజయోత్సవ ఉత్సవాలను జరుపుతున్నారు.. ఎందులో విజయం సాధించారు.. అవినీతిలోనా? అని మండిపడ్డారు. విజయోత్సవ ఉత్సవాలు కాదు.. వంచన ఉత్సవాలు చేయండని సంచలన కామంట్స్ చేశారు.