బీజేపీ కేడర్ లో ఫుల్ జోష్.. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి రాష్ట్రానికి బండి సంజయ్

by Prasad Jukanti |
బీజేపీ కేడర్ లో ఫుల్ జోష్.. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి రాష్ట్రానికి బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన గోరక్ష కార్యకర్త అరుణ్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మియాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్ ను మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్ లు పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తో అరుణ్ ను ఫోన్ లో మాట్లాడించారు. అనంతరం అరుణ్ కు మెరుగైన చికిత్స అందించవలసిందిగా ఆసుపత్రి యాజమాన్యానికి ఎమ్మెల్యేలు సూచించారు.

నేడు రాష్ట్రానికి బండి సంజయ్ రాక

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ తొలిసారి తెలంగాణకు రాబోతున్నారు. ఇవాళ రాత్రి ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు భారీ స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి.

షెడ్యూల్ ఇలా..

-ఇవాళ రాత్రి 10:30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు

-రేపు (బుధవారం) ఉదయం 8 గంటలకు హైదరాబాద్ - కరీంనగర్ కు ప్రయాణమై మధ్యాహ్నం 12 గంటలకు మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని దర్శఇంచుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలకు కొండగట్టు, మధ్యాహ్నం 2.45 గంటలకు జగిత్యాలలోని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్, సాయంత్రం 4 గంటలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, సాయంత్రం 6 గంటలకు సిరిసిల్లలోని మార్కండేయ దేవాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు కరీంనగర్ తన ఇంట్లో బస చేస్తారు.

-ఎల్లుండి (గురువారం) ఉదయం 9.15 గంటలకు మహాశక్తి అమ్మవారిని దర్శించుకుని, 10.35 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎంపీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. 1 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం వద్దకు చేరుకుంటారు. సా. 5 గంటలకు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగనున్నది. బీజేపీ ఆఫీస్ లో సన్మానం అనంతరం రాత్రి 9 గంటలకు కరీంనగర్ కు బయలుదేరి వెళ్తారు.

Advertisement

Next Story

Most Viewed