Bandi Sanjay: 'సెప్టెంబర్ 17' ను.. 'తెలంగాణ విమోచన దినోత్సవం' పేరుతోనే నిర్వహించాలి! బండి సంజయ్

by Geesa Chandu |
Bandi Sanjay: సెప్టెంబర్ 17 ను.. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోనే నిర్వహించాలి! బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి(Central Minister) బండి సంజయ్(Bandi Sanjay) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్(Photo Exhibition) ను ప్రారంభించారు. కేంద్రం అధికారికంగా.. 'సెప్టెంబర్ 17' ను విమోచన దినోత్సవంగా నిర్వహిస్తుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.." తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని అన్నారు. గత ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను సమైక్యతా దినోత్సవం పేరుతో జరిపితే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటోందని విమర్శించారు. అయితే తనకు ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొనాలని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం కూడా అందిందని, సెప్టెంబర్ 17 ను విమోచన దినోత్సవం పేరుతో నిర్వహిస్తేనే ఆ కార్యక్రమానికి వెళ్తాను" అని బండి వెల్లడించారు.

విమోచన దినోత్సవం సందర్భంగా.. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన బండి సంజయ్ ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలని పిలుపునిచ్చారు. నిజాం పాలనలో మహిళలపై జరిగిన దాడులు, అప్పుడు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలుసుకోవాలని.. బైరాన్ పల్లి, నిర్మల్ వంటి ప్రాంతాలకు సంబంధించిన ఘటనలను కళ్ళకు కట్టినట్లు ఫోటోల రూపంలో ఎగ్జిబిషన్ లో పొందుపరిచామని అన్నారు. ఇంకా కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారెందరో.. నిజాం కు ఎదురొడ్డి పోరాడారని తెలిపారు.

గత ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని, దీనికి ప్రేరణ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, అప్పుడు ఆయనే నిజాం మెడలు వంచి తెలంగాణ కు విముక్తిని కల్పించారని అన్నారు. అయితే నిజాం కు వ్యతిరేకంగా గళమెత్తిన వీరుల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే వారి చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed