- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్ జైలుకే బండి సంజయ్.. ఎందుకో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. పేపర్ లీక్ వ్యవహారంలో హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. తొలుత ఖమ్మం కోర్టుకు తరలిస్తారని అంతా భావించారు. అయితే సెక్యూరిటీ, ట్రావెలింగ్ దృష్ట్యా బండిసంజయ్‌ను కరీంనగర్ జైలుకు తీసుకెళ్లారు. ఈ సమయంలో బండి సంజయ్ ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు. న్యామయే గెలుస్తుందంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేశారు.
కాగా తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పదో తరగతి హిందీ పేపర్ లీక్ ఘటన వెనక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉందంటూ పోలీసులు మంగళవారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనపై సీఆర్పీసీ 154, 157 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుంచి హనుకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. ఇరు న్యాయవాదుల వాదనలు విన్న మేజిస్ట్రేట్ బండి సంజయ్‌కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేపర్ లీకేజీ కేసులో నేరాన్ని ఒప్పుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్‌కు ఈ రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఏ1గా బండి సంజయ్, ఏ2గా భూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోరు సురేశ్, ఏ7గా పోరు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9 పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పాతబోయిన వసంత్ పేరును చేర్చారు.
‘‘ఏ2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలకు 10:41కి పేపర్ పంపించారు. బండి సంజయ్‌కు 11:24కి ప్రశ్నాపత్రం చేరింది. 9:30కే ప్రశ్నాపత్రం లీకైందంటూ ప్రశాంత్ తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని బండి సంజయ్, ప్రశాంత్ ప్రయత్నం చేశారు. విచారణలో ఏ1 బండి సంజయ్ తన నేరాన్ని ఒప్పుకున్నారు. మరికొంత మంది ప్రధాన సాక్షులను విచారించాలి. కేసులో నలుగురిని అరెస్ట్ చేశాం. మిగిలిన వారు పరారీలో ఉన్నారు.’ అని పోలీసులు వెల్లడించారు.