బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు.. ఏపీలో బీజేపీని స్ట్రాంగ్ చేసేందుకు హై కమాండ్ ప్లాన్..!

by Satheesh |   ( Updated:2023-08-19 05:11:27.0  )
బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు.. ఏపీలో బీజేపీని స్ట్రాంగ్ చేసేందుకు హై కమాండ్ ప్లాన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను బాధ్యతలను తొలగించిన అనంతరం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చింది. కాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బండిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఆయనకు నాలుగు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, గోవా బాధ్యతలు ఆయనకు అప్పజెప్పనున్నట్లు సమాచారం. ముంబై యూనిట్‌ను సైతం ఆయనకే అప్పగించనున్నట్లు టాక్. ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ఇన్‌చార్జిగా ఆయన ఈ రాష్ట్రాల్లో పని చేయనున్నారు.

21న ఏపీలో మీటింగ్

ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉంది. తెలంగాణలోలా ఏపీలో పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని భావించి బండిని పంపించినట్లు తెలుస్తోంది. ఈనెల 21వ తేదీన అక్కడి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. వారికి ఓటర్ మొబిలైజేషన్, కొత్త ఓటర్లను బీజేపీ వైపునకు ఆకర్షితులను చేయడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణలో చేపట్టే రథయాత్రలో సైతం బండి ఇన్‌వాల్వ్ కానున్నారు.

బూత్‌ల వారీగా బీజేపీకి మద్దతు తెలిపే వారు ఎవరు? వారి ఓట్లు లిస్టులో ఉన్నాయా? అనే విషయాలను ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ఇన్‌చార్జులు పరిశీలించనున్నారు. మహారాష్ట్రలో హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ బండి పార్టీకి ప్లస్ అవుతారని భావిస్తున్నారు. తెలంగాణకు రేఖా వర్మ రానున్నట్లు తెలుస్తోంది. ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఉత్తరాఖండ్ రాష్ట్ర కో ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed