నయీం కేసును రీ ఓపెన్ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్

by GSrikanth |
నయీం కేసును రీ ఓపెన్ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత గ్యాంగ్‌‌స్టర్ నయీం కేసును రీ ఓపెన్ చేయించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నయీం పేరిట ఉన్న వందల ఎకరాల భూములు, ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరినీ వదిలిపెట్టబోము అంటున్నారు.. అసలు ఎవరినైనా అరెస్ట్ చేస్తే కదా వదిలిపెట్టడానికి అని కాంగ్రెస్ నేతలపై సెటైర్ వేశారు. నా ఫోన్‌తో పాటు మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఫోన్‌లు కూడా ట్యాపింగ్ చేశారని కీలక ఆరోపణలు చేశారు. ఈ ట్యాపింగ్ వ్యవహారం వెనుక కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నారు. రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు బీజేపీ నాయకులను హింసించారని అన్నారు. ఈ కేసులో టైమ్ పాస్ చేయొద్దని హితవు పలికారు.

Advertisement

Next Story