Paper leak Case: బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారు: పోలీసులు

by srinivas |   ( Updated:2023-04-05 12:09:19.0  )
Paper leak Case: బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారు: పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేపర్ లీకేజీ కేసులో నేరాన్ని ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ఎదుట హాజరుపర్చారు. ఈ మేరకు బండి సంజయ్ రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టులో సమర్పించారు. ఏ1గా బండి సంజయ్‌, ఏ2గా భూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోరు సురేశ్, ఏ7గా పోరు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9 పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పాతబోయిన వసంత్ పేరును చేర్చారు.

‘‘ఏ2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలకు 10:41కి పేపర్ పంపించారు. బండి సంజయ్‌కు 11:24కి ప్రశ్నాపత్రం చేరింది. 9:30కే ప్రశ్నాపత్రం లీకైందంటూ ప్రశాంత్ తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని బండి సంజయ్, ప్రశాంత్ ప్రయత్నం చేశారు. విచారణలో ఏ1 బండి సంజయ్ తన నేరాన్ని ఒప్పుకున్నారు. మరికొంత మంది ప్రధాన సాక్షులను విచారించాలి. కేసులో నలుగురిని అరెస్ట్ చేశాం. మిగిలిన వారు పరారీలో ఉన్నారు.’ అని అటు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story