HYD : సినీ ప్రియులకు బిగ్ షాక్.. తెలంగాణలో రెండు వారాలపాటు థియేటర్స్ క్లోజ్

by Jakkula Samataha |   ( Updated:2024-05-15 07:33:56.0  )
HYD : సినీ ప్రియులకు బిగ్ షాక్.. తెలంగాణలో రెండు వారాలపాటు థియేటర్స్ క్లోజ్
X

దిశ, సినిమా : సినీ ప్రియులకు బిగ్ షాక్ తగలనుంది. అసలే సమ్మర్.. ఏ కాస్త టైం దొరికినా సినిమాకు వెళ్దాం అని ఆలోచిస్తుంటారు జనాలు. కానీ వారికి ఊహించని విధంగా షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా థియేటర్స్ క్లోజ్ కానున్నాయంట. అయితే దీనికి గల అసలు కారణం లాభాల కంటే నష్టాలే ఎక్కువ రావడం, ఆక్యుపెన్సీ రేటు పడిపోవడమేనంట. దీంతో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 17 వ తేదీ నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ను మూసివేయనున్నట్లు, హైదరాబాద్ సిటీలో కూడా సినిమా థియేటర్స్ క్లోజ్ కానున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

గత రెండు వారాల నుంచి మంచి పెద్ద సినిమాలు ఏం రావడం లేదని, ప్రేక్షకులు కూడా ఎక్కువగా రాకపోవడంతో, సినిమా థియేటర్స్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయంట. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా చూడటానికి వచ్చే వారికంటే, సినిమా థియేటర్స్ మెయింటనెన్స్ ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. అలాగే సినిమా ప్రదర్శనల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందని, అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుందంట. రెండు వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేయనున్నారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచితే సినిమా ప్రదర్శనలు కొనసాగిస్తామంటోన్నాయి యాజమాన్యాలు. అయితే మల్టీప్లెక్స్ లు మాత్రమే తెరిచి ఉంటాయని సమాచారం అందుతోంది. కాగా, దీని గురించి పూర్తి సమాచారం తెలియలేదు.

Advertisement

Next Story