ప్రగతి భవన్, రాజ్ భవన్‌కు మధ్య చిచ్చు పెట్టింది అతడే: బక్క జడ్సన్

by Satheesh |
ప్రగతి భవన్, రాజ్ భవన్‌కు మధ్య చిచ్చు పెట్టింది అతడే: బక్క జడ్సన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అడిషనల్ ఏజీ జే.రామచంద్రరావు ప్రభుత్వ అధికారిగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని అతడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేత బక్క జడన్స్ మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ప్రైవేట్ కేసులో రామంచదర్ రావు ఈడీ కార్యాలయానికి వెళ్లడాన్ని జడ్సన్ ఆక్షేపించారు. ఈ మేరకు ఇవాళ రాజ్ భవన్‌లో ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ బిల్లుల జాప్యం విషయంలో గవర్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అడిషనల్ ఏజీనే రచించినట్లు తన వద్ద సమాచారం ఉందని తెలిపారు.

గవర్నర్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది మహిత్ మరెవరో కాదని అతను అడిషనల్ ఏజీ రామందర్ రావు సొంత అల్లుడు అని అందువల్ల గవర్నర్ చేత నియమితులైన ఏజీ చట్టవిరుద్ధమైన ప్రవర్తన కారణంగా అతడిని తొలగించాలని కోరారు. అలాగే అదనపు ఏజీ పలువురు ప్రైవేట్ వ్యక్తులకు సమాచారం ఇస్తూ సుమారు రూ.300 కోట్ల వరకు అక్రమ సంపాదన కూడబెట్టుకున్నారని ఆరోపించారు. రాజ్ భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య అనవసర విభేధాలు సృష్టించింది రామచందర్ రావేనని.. ఆయన కార్యకలాపాలపై నేరుగా ఏసీబీ నుంచి నివేదిక తెప్పించుకోవాలని కోరారు.

టీఎస్ పీఎస్సీ బోర్డును రద్దు చేయండి:

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేసి, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని జడ్సన్ గవర్నర్‌ను కోరారు. విభజన చట్టం ప్రకారం కమిషన్‌ను ఫిక్స్ చేయడానికి అమలు చేయడానికి గవర్నర్‌కు నేటికి అధికారాలు ఉన్నాయని అందువల్ల ఈ అంశంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. ఎస్ఎన్ఎం ఫార్మసీ కాలేజీలో 1.18 కోట్ల ఫీజు కుంబకోణంలో ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, జనార్ధన్ రెడ్డిలు ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు. అలాగే టీఎస్ పీఎస్సీని నడపడానికి ఓ కమిటీని నియమించాలని కోరారు.

Advertisement

Next Story