Breaking: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బిగ్ షాక్.. నలుగురి బెయిల్ పిటిషన్లు కొట్టివేత

by Satheesh |   ( Updated:2024-04-26 11:36:41.0  )
Breaking: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బిగ్ షాక్.. నలుగురి బెయిల్ పిటిషన్లు కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఈ మేరకు నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని నలుగురు నిందితులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న న్యా్యస్థానం తీర్పును రిజర్వ్ చేసి.. ఇవాళ జడ్జిమెంట్‌ను వెల్లడించింది.

Advertisement

Next Story