BAC Meeting: ముగిసిన బీఏసీ సమావేశం.. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు

by Shiva |
BAC Meeting: ముగిసిన బీఏసీ సమావేశం.. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ (Speaker Prasad Kumar) అధ్యక్షతన జరిగిన బీఏసీ (BAC) సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 19న ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా 13న గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 26 వరకు వివిధ పద్దులపై సభలో వాడీవేడి చర్చ జరగనుంది. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో నిర్వహించిన బీఏసీ సమావేశానికి (BAC Meeting) సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy)తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు (Harish Rao), వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) హాజరయ్యారు. కాగా, రూ.3.20 లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.

Next Story