- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేఏ పాల్ కోసం ఎంత దూరమైనా వెళ్తా.. బాబూ మోహన్ ఫస్ట్ రియాక్షన్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ కమెడియన్, బీజేపీ నేత బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాబూ మోహన్‌కు కండువా కప్పి కేఏ పాల్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బాబూ మోహన్ తీసుకున్న నిర్ణయంపై అటు సోషల్ మీడియాలో ఇటు బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ప్రజాశాంతి పార్టీలో చేరిన తర్వాత బాబూ మోహన్ స్పందించారు.
టికెట్ ఇస్తా అని చెప్పి బీజేపీ తనను మోసం చేసిందని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన సెగ్మెంట్‌ను వేరొకరికి ఇచ్చి మోసం చేయడమే కాకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ దెబ్బ కొట్టారని ఆవేదన చెందారు. అందుకే ప్రజాశాంతి పార్టీలో చేరానని అన్నారు. కేఏ పాల్‌ను, ప్రజాశాంతి పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తానని తెలిపారు. అవకాశం ఇస్తే వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఈ సారి బరిలో ఉంటానని వెల్లడించారు. కేఏ పాల్ కోసం ఎంత దూరమైనా వెళ్తా, ఏవైనా చేస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు.