- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్.. ఆ ఎంపీ స్థానం ఇచ్చేసిన కేఏపాల్..
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. గతంలో బీజేపీకి రాజీనామా చేసిన టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ఇవాళ ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబు మోహన్‌ను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ వెల్లడించారు. ఇవాళ ఆయన పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. బాబు మొహన్ పుట్టిన ఊరు అయిన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు స్పష్టంచేశారు. బాబు మోహన్ చేసిన సేవలు తెలియని వారంటూ ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. 1451 సినిమాల్లో ఆయన నటించారని, తెలుగు వారందరూ వారి సినిమాలు చూశారని తెలిపారు.
ఆయన రెండు సార్లు టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారని గుర్తుచేశారు. వరంగల్ ప్రజల సంపూర్ణ అభివృద్ధి కొరకు పార్లమెంటులో అడుగుపెట్టారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ పాలన ఇన్ని రోజులు చూశారని, ఒక్కసారి ప్రజాశాంతి పార్టీకి చూడాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాడానికి బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్‌గా తెలంగాణలో బాబు మోహన్ గెలువాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాబు మొహన్‌కు కండువా కప్పి ప్రజాశాంతి పార్టీలోకి కేఏపాల్ ఆహ్వానించారు.