- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబుమోహన్
దిశ, డైనమిక్ బ్యూరో:ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి బాబు మోహన్ ను నియమించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని కేఏ పాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఐఐఎస్ ఆఫీసర్ కూనపరెడ్డి హరిప్రసాద్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. ప్రజల కోరిక మేరకు లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామన్నారు. తమ పార్టీ తరపున తొలి అభ్యర్థిగా వరంగల్ స్థానానికి బాబు మోహన్ ను ఇప్పటికే ప్రకటించామన్నారు. బాబు మోహన్ పార్టీలో చేరిన తర్వాత అనేక మంది నాయకులు ప్రజాశాంతిలో చేరుతామని ముందుకు వస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదని అందుకే కాంగ్రెస్ లో నలుగురు ఏక్ నాథ్ షిండేలను తయారు చేశారని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఏక్ నాథ్ షిండే అయ్యే అవకాశం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో మంచినీళ్లు ఇవ్వడం లేదని, కరెంట్ కోతలు మొదలయ్యాయని ఆరోపించారు.